FREE POWER: ‘జగ్జీవన్ జ్యోతి’ పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు తమకు ఇస్తున్న అన్యాయమని పేర్కొంటూ గుంటూరు నగరంలోని కోబాల్డు పేటకు చెందిన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళనకు దిగారు. ఎన్నో ఏళ్లుగా ఒకే ప్రాంతంలో ఉన్న తమకు విద్యుత్ రాయితీ వర్తిస్తోందని, జూన్ నుంచి అధికారులు బిల్లు చెల్లించాలంటున్నారని కలెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా అందించాల్సి ఉన్నా.. బిల్లులు జారీ చేశారని పేర్కొన్నారు. ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. కేవలం ఎస్సీ కాలనీలు, ఎస్టీ తండాల్లో ఉన్న వారికే రాయితీ వర్తించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని.. ఈ కొత్త నిబంధనల ప్రకారం చూసినా.. ఒకే ప్రాంతంలో ఉంటున్నందున తమకు రాయితీకి అర్హత ఉందని బాధితులు పేర్కొన్నారు. విజయవాడకు చెందిన పలువురు ఎస్సీ లబ్ధిదారులకు కూడా ఇలాగే బిల్లులు అందాయి. ఈ సందర్భంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బాబూరావు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాల అమల్లో భాగంగా డిస్కంలు అనర్హుల జాబితాను రూపొందించి.. పేద వర్గాలకు ఇస్తున్న సబ్సిడీని ఉపసంహరించే ప్రయత్నం చేస్తున్నాయన్నారు.
ఒకే కనెక్షన్ ఉన్నా.. బిల్లు వస్తోంది
కోబాల్డుపేటకు చెందిన ఎం.దీనమ్మ సర్వీసు నం-1122300373512. గత రెండేళ్లలో ఎప్పుడూ వినియోగం 200 యూనిట్లు దాటలేదు. ఎస్సీలకు ఇచ్చే విద్యుత్ రాయితీ అమెకు అందుతోంది. జూన్‌లో వినియోగం 109 యూనిట్లు మాత్రమే ఉన్నా రూ.332 చెల్లించాలంటూ బిల్లు అందించారు.
ఇవీ చదవండి: