ETV Bharat / state

పంట పొలాలనూ వదలని ఇసుకాసురులు..! - గుంటూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా తాజా వార్తలు

తీరంలో దొంగలు పడి సహజ సంపదైన మట్టి, ఇసుక భారీగా దోచేసి అక్రమార్జనకు పాల్పడుతున్నారు. పచ్చని పంట భూములను వదలడం లేదు. తెల్లవారుజామున జేసీబీలతో తవ్వేసి ట్రాక్టర్లు, లారీల్లో తరలిస్తున్నారు. నిర్మాణరంగంలో మెరకలు వేయడానికి, 216 జాతీయ రహదారి విస్తరణ, విజయవాడ-చెన్నై మధ్య మూడో రైల్వేలైన్‌ నిర్మాణ పనులకు మట్టి, బుసుకకు డిమాండ్‌ ఏర్పడింది. ఇసుకకు కొరత ఏర్పడింది. గిరాకీని ఆసరగా తీసుకుని అడ్డగోలుగా తవ్వకాలు సాగిస్తూ వందల ట్రక్కుల కొద్దీ అక్రమంగా రవాణా చేస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. భారీగా దందా జరుగుతున్నా మైనింగ్‌, ఎస్‌ఈబీ అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు.

Sand smuggling in guntur
గుంటూరు జిల్లాలో ఇసుక అక్రమ రవాణా
author img

By

Published : Jan 10, 2021, 10:52 AM IST

గుంటూరు జిల్లా బాపట్ల మండలం పడమర బాపట్ల, వెదుళ్లపల్లి కేంద్రంగా అక్రమ ఇసుక క్వారీయింగ్‌ జోరుగా సాగుతోంది. ఇసుక వ్యాపారం భారీగా లాభాలు తెచ్చిపెడుతుండడంపై స్థానిక నాయకులు రంగంలోకి దిగారు. యథేచ్ఛగా అక్రమ రవాణా జరుగుతన్నా.. అధికారులు పట్టించుకోవట్లేదని స్థానికులు వాపోతున్నారు. పంటపొలాల్లో ఇసుక తవ్వుతున్న కారణంగా.. భూసారం తగ్గుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పంటపొలాలను సైతం వదలేట్లేదు ఇసుక అక్రమార్కులు

బాపట్ల కేంద్రంగా జిల్లా ఏర్పాటవుతుందన్న ప్రచారంతో స్థిరాస్తి, నిర్మాణ రంగాలు ఊపందుకున్నాయి. బహుళ అంతస్తులు, డూప్లెక్స్‌ ఇంటి నిర్మాణాలు పెద్దఎత్తున చేపట్టారు. ప్రభుత్వ ఇసుక రీచ్‌ నుంచి ట్రాక్టర్‌ ట్రక్కు ఇసుక రావాలంటే రూ.7500 వెచ్చించాల్సి వస్తోంది. తీర ప్రాంతంలో ఇసుక భూములు విస్తారంగా ఉన్నాయి. ఈ భూముల్లో మెరక పనులకు వినియోగించే బుసుకతో పాటు నిర్మాణాలకు వాడే కట్టుబడి ఇసుక లభిస్తోంది. ట్రాక్టర్‌ ట్రక్కు ఇసుక రూ.4 నుంచి 5 వేలకే దొరుకుతోంది. అదే బుసకను రూ.2 వేల దాకా విక్రయిస్తున్నారు.

చోద్యం చూస్తున్న అధికార యంత్రాంగం..

పడమర బాపట్ల ఛానల్‌, పేరలి కాల్వ సమీపంలో ఏడాదికి మూడు పంటలు కూరగాయలు, పూలతోటలతో కళకళలాడే భూముల్లో అక్రమంగా ఇసుక క్వారీలు ఏర్పాటు చేశారు. ఎకరా భూమిని ఎంతైనా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. తెల్లవారుజామున జేసీబీలతో పై మూడు అడుగుల దాకా బుసుక, తరువాత పన్నెండు అడుగుల లోతు తవ్వి ఇసుకను ట్రాక్టర్లు, భారీ ట్రక్కుల్లో తరలిస్తున్నారు. ఇప్పటికే వంద ఎకరాల అసైన్డ్‌ భూముల్లో అక్రమ క్వారీలు ఏర్పాటు చేసి రూ.కోట్లు కొల్లగొట్టారు. పంటల సీజన్‌ ముగిసిన అనంతరం మరో రెండు వందల ఎకరాలను క్వారీలుగా మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పర్యావరణం దెబ్బతిన్న కారణంగా.. పాటు పంట భూములు భూసారాన్ని కోల్పోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

పేదల ఇళ్ల స్థలాలకు మెరకల పేరిట కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం, యాజలి, చింతాయపాలెం నుంచి ట్రాక్టర్లలో తరలించి సొమ్ము చేసుకున్నారు. బాపట్ల మండలం ఆసోదివారిపాలెం, పాండురంగాపురం, పోతురాజుకొత్తపాలెం, కొత్త ఓడరేవు, బసివిరెడ్డిపాలెంలో తవ్వకాలు సాగిస్తున్నారు. నల్లమడ వాగు, పేరలి, ఈస్ట్‌స్వాప్‌, వెస్ట్‌స్వాంప్‌, మురుకుండపాడు ఉత్తర, తూర్పు తుంగభద్ర మురుగు కాల్వల కట్టలను అక్రమార్కులు వదల్లేదు. తవ్వకాలతో కట్టలు బలహీనంగా మారాయి. అడ్డుకోవాల్సిన ఎస్‌ఈబీ, మైనింగ్‌, పోలీస్‌ శాఖలు చోద్యం చూస్తున్నాయి. అక్రమార్కుల గురించి తెలిసినా నేతల ఒత్తిడితో పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.

ఇదీ చూడండి:

ఈ చిత్రాన్ని చూశారా?... ఇదో పెద్ద వ్యవహారం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.