గుంటూరు జిల్లా పిడుగురాళ్ల ఆర్టీసీ డిపో పల్లెవెలుగు బస్సు మంగళవారం సాయంత్రం మాచర్ల నుంచి పిడుగురాళ్లకు వస్తోంది. అందులో 42 మంది ప్రయాణికులు ఉన్నారు. నడికూడి వద్దకు రాగానే డ్రైవరు ఎం.సుభానీ (54)కి హఠాత్తుగా గుండెనొప్పి వచ్చింది. భరిస్తూనే దాచేపల్లి మండలం నారాయణపురం బంగ్లా వద్దకు తెచ్చి దారి పక్కన ఆపి ప్రయాణికులకు విషయం చెప్పారు. వెంటనే కండక్టరు ఖాసీంబీతో పాటు ప్రయాణికులు సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత అంబులెన్స్‌లో పిడుగురాళ్ల తరలిస్తుండగా మార్గమధ్యలో తుమ్మలచెరువు వద్ద కన్నుమూశారు. అయినా పిడుగురాళ్ల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లి వైద్యులకు చూపించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని గురజాల ప్రభుత్వాసుపత్రికి పంపారు. మృతుడికి భార్య, నలుగురు పిల్లలున్నారు.
ఇదీ చదవండీ.. ఈఏసీ సమావేశం తర్వాతే సీమ ఎత్తిపోతలపై నిర్ణయం: జావడేకర్