గుంటూరు జిల్లా మేడికొండ్రు మండలం పేరేచర్లలో వ్యక్తిపై దాడి చేసి చోరీకి పాల్పడిన వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుడిని రిమాండ్ కు పంపించారు. ఓంటిపులి సాంబయ్య మంచాలు తయారు చేస్తాడు. ఓ గుర్తు తెలియని వ్యక్తి అతని దగ్గరకు వచ్చి.. మంచం చేయాలని అడిగాడు. నిజమని సాంబయ్య బేరం కుదుర్చుకున్నాడు. ఇంతలో అతను సాంబయ్యపై దాడి చేసి రూ.15 వేలు దొంగిలించాడు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నిందితుడు మంగళగిరి టిప్పల బజారుకు చెందిన పుల్లా వెంకట్టేశ్వర్లుగా గుర్తించారు. గతంలో ఈ తరహా చోరీలు దాదాపు 30 దాకా చేశాడని గుర్తించారు. గుంటూరు పట్టణం, మంగళగిరి , చుట్టు పక్కల ప్రాంతాల్లో ఇలాంటి చోరీలు చేసాడని పోలీసులు తెలుసుకున్నారు. వెంకట్టేశ్వర్లుపై 30 కేసులు ఉన్నాయి. మేడికొండ్రు పోలీసులు నిందితుడిని పట్టుకొని రిమాండ్ కు పంపించారు.
ఇదీ చదవండి: ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం..