ETV Bharat / state

నన్నపనేనిని వెంటనే అరెస్ట్ చేయండి: ఆర్కే - rk request to arrest rajakumari

నన్నపనేని రాజకుమారిని వెంటనే అరెస్ట్ చేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే డీజీపీని కోరారు. ఆమె మహిళా పోలీసు అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు.

నన్నపనేని రాజకుమారిని వెంటనే అరెస్ట్ చేయండి: ఆర్కే
author img

By

Published : Sep 13, 2019, 8:29 PM IST

నన్నపనేని రాజకుమారిని వెంటనే అరెస్ట్ చేయండి: ఆర్కే

మహిళా పోలీసు అధికారిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. తెదేపా నేత నన్నపనేని రాజకుమారిని వెంటనే అరెస్ట్ చేయాలని వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డీజీపీని కోరారు. మంగళగిరిలో దళిత సంఘాల నేతలతో కలసి వెళ్లిన ఎమ్మెల్యే ఆర్కే.. డీజీపీ గౌతమ్ సవాంగ్​ను కలిసి ఫిర్యాదు చేశారు. గతంలో మంత్రిగా చేసిన అచ్చెన్నాయుడు... ఐపీఎస్ ఉన్నతాధికారిని దూషించారనీ.. అధికారులపై తెదేపా నేతల దూషణ పర్వం కొనసాగించడం దారుణమనీ అన్నారు. వీరందరిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి

విశ్రాంత ఐఏఎస్ యుగంధర్ నాదెళ్ల కన్నుమూత

Intro:AP_VJA_28_13_MRPS_DHARNA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) చలో ఆత్మకూరు కార్యక్రమంలో భాగంగా మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారిని అదుపులోకి తీసుకున్న మహిళ ఎస్సై పై రాజకుమారి దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ ,తక్షణమే రాజకుమారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విజయవాడ లెనిన్ కూడలిలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసనకు దిగిన కార్యకర్తలు. సాటి మహిళపై రాజకుమారి కులం పేరుతో దూషణకు దిగారని, ఇది ముమ్మాటికీ దళితులను కించపరడమే అని ఎమ్మార్పీఎస్ నాయకులు సురేష్ అన్నారు. రాజకుమారి పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆమె వ్యాఖ్యలను ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని సురేష్ డిమాండ్ చేశారు. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించినందుకు ఇప్పటికే రాజకుమారి పై కేస్ నమోదు అయినందున ఆమెను తక్షణమే అరెస్టు చేయాలనున్నారు. దళితులను ఎవరు కించపరిచే వ్యాఖ్యానించిన సహించేది లేదని సురేష్ అన్నారు.
బైట్... సురేష్ కుమార్ ఎమ్మార్పీఎస్ నాయకులు

Body:AP_VJA_28_13_MRPS_DHARNA_AVB_AP10050

Conclusion:AP_VJA_28_13_MRPS_DHARNA_AVB_AP10050
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.