గుంటూరు మిర్చియార్డు మిరప బస్తాలతో ఎరుపెక్కింది. రికార్డు స్థాయిలో రైతులు మిర్చి పంటను తీసుకువచ్చారు. లక్షా 80 వేలకు పైగా టిక్కీలు యార్డుకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజులు వరుస సెలవులు వచ్చిన కారణంగా.. కార్యకలాపాలు జరగలేదు.
ఇవాళ మాత్రం.. గుంటూరు జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి రైతులు పెద్దఎత్తున సరకు తీసుకువచ్చారు. వచ్చిన సరకులో 80శాతం లావాదేవీలు పూర్తైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం అన్ని రకాల మిర్చికి మంచి ధరలే ఉన్నందున రైతులు విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: