గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామస్థులు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి బొత్స సత్యనారాయణకు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామంలో శ్మశాన వాటిక ను ఏర్పాటు చేయాలని ముస్లింలు ఆయనకు విన్నవించారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని సీఆర్డీఏ కమిషనర్ లక్ష్మీ నృసింహాన్ని మంత్రి ఆదేశించారు.
గతంలో పూడ్చేసిన పాలవాగుకు మరమ్మతులు చేయించి వినియోగంలోకి తీసుకురావాలని మల్లెల హరీంద్రనాథ్చౌదరి.. మంత్రి దృష్టికి తీసుకురాగా త్వరలోనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. రైతులు, గ్రామస్థుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.