ఇసుక కొరత కారణంగా రాష్ట్రంలో... నిర్మాణరంగం దెబ్బతిన్నదని మాజీమంత్రి రావెల కిషోర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. భాజపా చేపట్టిన గాంధీ సంకల్ప యాత్ర... గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం పేరిచర్లకు చేరింది. ఈ సందర్భంగా కిషోర్‌బాబు వైకాపా ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నిధులు కేంద్రం ఇస్తుంటే... ప్రచారం రాష్ట్ర ప్రభుత్వం చేసుకుంటుందని ఆరోపించారు. అభివృద్ధి పనులు నిలిపివేయడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు, రైతుల ఆత్మహత్యలతో రాష్ట్రం శ్మశానవాటికలా మారిందని దుయ్యబట్టారు.
ఇవీ చదవండి