Congress leader Rahul Gandhi: 2014 తర్వాత దేశంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ఉద్యోగ కల్పనా సంస్థలపై దాడి చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ సంస్థలకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలో చౌటకూర్ నుంచి కంసాన్ పల్లి జోగిపేట రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగింది.
మార్గం మధ్యలో వివిధ వర్గాల ప్రజల్ని కలుసుకున్న రాహుల్‌గాంధీ వారి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. భోజన విరామం తర్వాత దానంపల్లి నుంచి యాత్ర ప్రారంభించిన రాహుల్, గడిపెద్దాపూర్ వరకు నడిచారు. గడి పెద్దాపూర్‌లో కార్నర్ మీటింగ్‌లో పాల్గొన్నారు. దేశంలో రోజురోజుకూ నిరుద్యోగం ఎందుకు పెరుగుతుందో అందరూ ఆలోచించాలని సూచించారు.
గ్యాస్ ధర 400 ఉన్నప్పుడు గొడవ చేసిన మోదీ ఇప్పుడు 1150రూపాయలు ఐనా ఎందుకు నోరు ఎత్తడం లేదని రాహుల్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి అనే రైతును వేదికపైకి పిలిచిన రాహుల్.. తెలంగాణలోని వ్యవసాయంలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి నాగిరెడ్డి మాటలు వింటే.. రాష్ట్రంలో రైతులు బాగు పడుతారని తెలిపారు.
ఇవీ చదవండి: