పులిచింతల జలాశయం నిండుకుండను తలపిస్తోంది. పూర్తి సామర్థ్యం 55.77టీఎంసీలు కాగా... ఉదయం ప్రాజెక్టు నిండిపోయింది. ఎగువ నుంచి ప్రస్తుతం 30వేల క్యూసెక్కులు మాత్రమే వరదనీరు వస్తోంది. దీంతో ఒక గేటు ఎత్తి 17వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. మరో 15వేల క్యూసెక్కుల నీటిని జలవిద్యుత్ కేంద్రానికి మళ్లించారు. పైనుంచి వచ్చే నీటి ప్రవాహాన్ని బట్టి ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టాలు ఉండేలా చూస్తూ.. మిగతా నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగించనున్నట్లు అధికారులు తెలిపారు. అంతకుమించి వరద ఉంటే గేట్ల ద్వారా బయటకు పంపేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పులిచింతల ప్రాజెక్టులోకి వరదనీరు చేరి జలాశయం నిండిపోవటంతో ఆ దృశ్యాలు చూసేందుకు సందర్శకులు భారీగా తరలివస్తున్నారు. కృష్ణమ్మ పరవళ్లను... పచ్చని ప్రకృతిని చూసి పరవశిస్తున్నారు. ప్రాజెక్టు వద్ద స్వీయచిత్రాలు దిగుతూ జ్ఞాపకాల్ని పదిలం చేసుకుంటున్నారు.
ఇదీ చూడండి