పిడుగురాళ్ల మండలం బ్రాహ్మణపల్లి దగ్గర పులిచింతల ప్రాజెక్ట్ నిర్వాసితులకు స్థలాలు కేటాయించినా... శ్వశాన వాటికను ఏర్పాటు చేయలేదు. మరోవైపు.. అదే ప్రాంతంలో ఓ వ్యక్తి చనిపోయారు.
అంత్యక్రియలకు చోటు లేక.. కుటుంబీకులు, స్థానికులు ఇబ్బంది పడ్డారు. చివరికి.. అయ్యప్ప స్వామి గుడి సమీపంలో శవాన్ని నడి రోడ్డుపై పెట్టి ధర్నా చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి నచ్చ జెప్పి పంపించారు.