ETV Bharat / state

Protests Against Chandrababu Naidu Arrest: అధినేత కోసం అలుపెరగని పోరు.. కొనసాగుతోన్న ఆందోళనలు, దీక్షలు, పూజలు

Protests Against Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా వివిధ వర్గాల ప్రజలు వినూత్న రీతిలో నిరసనలతో హోరెత్తించారు. అధినేత ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ.. తెలుగుదేశం శ్రేణులు ప్రార్థనలు చేశాయి. చంద్రబాబును విడుదల చేసే వరకు తమ పోరు ఆగదని నేతలు, కార్యకర్తలు తేల్చి చెప్పారు.

Protests Against Chandrababu Naidu Arrest

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 6, 2023, 7:54 PM IST

Protests Against Chandrababu Naidu Arrest: అధినేత కోసం అలుపెరగని పోరు.. కొనసాగుతోన్న ఆందోళనలు, దీక్షలు, పూజలు

Protests Against Chandrababu Naidu Arrest: చంద్రబాబు అరెస్టుని నిరసిస్తూ.. బాపట్ల జిల్లా అద్దంకిలో ఆ పార్టీ శ్రేణులు సంకెళ్లతో వినూత్నంగా నిరసన తెలిపాయి. న్యాయానికి, ప్రజాస్వామ్యానికి సంకెళ్లు అంటూ నినదించారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రోజుకో రీతిలో నిరసనలు కొనసాగిస్తునే ఉంటామని తెలిపారు. చంద్రబాబుకు సంఘీభావంగా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ సైకిల్‌ యాత్ర నిర్వహించారు. నాగులపాడు గ్రామం నుంచి మణికేశ్వరంలోని శివాలయం వరకు 8 కిలో మీటర్ల మేర సైకిల్‌ యాత్ర చేశారు. తమ పార్టీ అధినేత ఆరోగ్యంగా ఉండాలని, జైలు నుంచి త్వరగా విడుదల కావాలని కాంక్షిస్తూ పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం కంభంపాడులో తెలుగుదేశం శ్రేణులు చండీయాగం చేసి.. సంకల్ప దీక్ష చేపట్టాయి.

TDP Agitations Continues Against Chandrababu Arrest: వైసీపీ సర్కారుపై ఆగ్రహ జ్వాలలు.. చంద్రబాబుకు మద్దతుగా ముప్పేట ఆందోళనలు

TDP Leaders Agitations Continues in Andhra Pradesh: చంద్రబాబు అరెస్టును (Chandrababu Arrest) ఖండిస్తూ రాయలసీమలో టీడీపీ నేతలు వినూత్న రీతిలో ఆందోళనలు చేశారు. అనంతపురం టవర్‌ క్లాక్‌ వద్ద క్రిస్టియన్ సెల్‌ ఆధ్వర్యంలో మోకాళ్లపై కూర్చొని నిరసన తెలిపారు. సైకో పోవాలి - సైకిల్‌ రావాలంటూ నినాదాలు చేశారు. గుంతకల్లులో అరగుండు, అరమీసంతో ధర్నా చేశారు. జగన్‌ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించి పైశాచిక ఆనందాన్ని పొందుతోందని నేతలు మండిపడ్డారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా మేము సైతం అంటూ కర్నూలు జిల్లాలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు త్వరగా విడుదల కావాలని కోరుతూ.. గూడూరులో పార్టీ శ్రేణులు ట్రాక్టర్‌ ర్యాలీ నిర్వహించాయి. ఎమ్మిగనూరులో గొరవయ్యలు దీక్ష శిబిరం వద్ద నృత్యాలు చేసి నిరసన తెలిపారు. సీఎంకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

TDP Leaders Protests by Across the State Against CBN Illegal Arrest: చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణుల నిరసనలు

చంద్రబాబుకు దేవతల ఆశీర్వాదం ఉండాలని.. చిత్తూరు జిల్లా కుప్పంలో మహిళలు మహంకాళీ వేషధారణలో నృత్యాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా రైల్వేకోడూరులో జరిగిన నిరసన దీక్షకు సీపీఐ నాయకుడు బి.విజయ్‌భాస్కర్ నాయుడు సంఘీభావం తెలిపారు. చంద్రబాబును అరెస్ట్ చేసినంత మాత్రాన ఎవరూ అధైర్యపడాల్సిన అవసరం లేదని, ఆయన నిర్దోషిగా త్వరలోనే బయటకు వస్తారని పేర్కొన్నారు.

చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ.. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో అభిమానులు పాదయాత్ర నిర్వహించారు. పోలీసుల అడ్డగింతలను దాటుకుని.. తిమ్మరాజుపాలెం శ్రీ కోట సత్తమ్మ ఆలయం వరకు 12 కిలోమీటర్ల మేర యాత్రను కొనసాగించారు. కోనసీమ జిల్లా రాజోలులో మోకాళ్లపై నిలుచుని నిరసన తెలిపారు. అక్రమ కేసులు బనాయిస్తూ.. సీఎం జగన్‌ సైకోలా వ్యవహరిస్తున్నారని నేతలు మండిపడ్డారు.

TDP Leaders Protest Against Chandrababu Arrest: బాబు అరెస్టుపై కొనసాగుతున్న దీక్షలు.. ఎగసిపడుతున్న నిరసన జ్వాలలు..

కోనసీమ జిల్లా రావులపాలెంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అధిక సంఖ్యలో రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారని కక్షపూరితంగానే చంద్రబాబును అరెస్టు చేశారని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో టీఎన్​ఎస్​ఎఫ్​ ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు నల్ల బెలూన్లతో నిరసన తెలిపాయి. 'మేము సైతం బాబు కోసం' అంటూ విద్యార్థులు అక్షర ప్రదర్శన చేశారు.

Protests Against Chandrababu Arrest: చంద్రబాబును విడుదల చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.