Protest: ఉపాధి హామీ బకాయిలు చెల్లించాలంటూ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీ కమిషనర్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో.. 26 జిల్లాల నుంచి వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పాల్గొన్నారు. కమిషనర్ కార్యాలయం వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దాదాపు 450 కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయి ఉందని.., వాటిని వెంటనే విడుదల చేయాలన్నారు. రెండు పూటలా పని విధానాన్ని రద్దు చేయాలని, పని ప్రదేశానికి వెళ్లడానికి ఛార్జీలను చెల్లించాలని డిమాండ్ చేశారు.
వేతనం రోజుకు రూ. 600 లకు పెంచటంతో పాటు 200 రోజులు పని దినాలు కల్పించాలన్నారు. మున్సిపాలిటీల్లో విలీనం చేసిన గ్రామాల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలని.., పని ప్రదేశాల్లో చనిపోయిన వారికి రూ.10 లక్షల నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ సంయుక్త సంచాలకులు శివప్రసాద్కు కార్మిక సంఘం నేతలు వినతి పత్రం ఇచ్చారు. డిమాండ్లను పరిష్కరించని పక్షంలో.. ఆగస్టు 4న కలెక్టరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.
ఇవీ చూడండి