గుంటూరు భాస్కర్ థియేటర్లో 'ప్రతిరోజు పండగే' చిత్ర బృందం సందడి చేసింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో సాయిధరమ్‌తేజ్, హీరోయిన్ రాశీఖన్నా గుంటూరులో పర్యటించారు. ఈ నెల 20న విడుదల కాబోతున్న 'ప్రతిరోజు పండగే' కుటుంబ కథా చిత్రాన్ని ప్రతి ఒక్కరు చూడాలని... విజయవంతం చేయాలనీ హీరో, హీరోయిన్ కోరారు. చిత్రంలోని ప్రతి సన్నివేశం ప్రేక్షలకుల మనసు దోచుకుంటుందన్నారు.
ఇదీ చూడండి: 'బావ'తో పండగే అంటోన్న రాశీఖన్నా..!