గుంటూరు జిల్లా(guntur district) తెనాలి పట్టణంలోని రామకృష్ణ కవి కళాక్షేత్రం వద్ద వెస్ట్ బెర్రీ పాఠశాల నిర్వహించిన రెండు కిలోమీటర్ల నడక కార్యక్రమానికి(two-kilometer walk organized by Westberry School) ముఖ్య అతిథులుగా పవర్ లిఫ్టింగ్ క్రీడలో కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ సాయి రేవతి(Powerlifter Sai Revathi), మున్సిపల్ ఛైర్ పర్సన్ సయ్యద్ కాలేదా నసీమ్లు పాల్గొన్నారు. ఈ నడక కార్యక్రమంలో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు. శారీర దారుఢ్యంతో పాటు మానసిక వికాసానికి దోహదపడే క్రీడలను విద్యార్థులు ఎన్నడూ విస్మరించరాదని సాయి రేవతి సూచించారు. క్రీడలతో ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవచ్చనీ.. అదే క్రమంలో రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ వ్యాయామం అవసరమని.. వ్యాయామంతోనే చక్కటి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చని తెలిపారు. కరోనా వల్ల విద్యార్థులు క్రీడలు, వ్యాయామ సంబంధిత కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థులను ప్రోత్సహించడంలో తమ పాఠశాల ఎప్పుడూ ముందుంటుందని ప్రిన్సిపల్ శేషులత తెలిపారు. అనంతరం సీనియర్ వాకర్స్ వెంకట శివ ప్రసాద్, రామి రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, రమణయ్య, పరుచూరి రాఘవేంద్ర రావును శాలువాలతో సత్కరించారు. తొలుత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు జుంబా డాన్స్ చేశారు.
ఇదీ చదవండి