గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మేడికొండూరులో మిరప లోడుతో ఉన్న ట్రాక్టర్లు బారులు తీరాయి. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ ప్రకటించగా... గుంటూరు మిర్చియార్డ్లో కొనుగోలు నిలిపివేశారు. పంట అమ్ముకునే అవకాశం లేక కోల్డ్స్టోరేజ్లో నిల్వచేసేందుకు మిరప టిక్కీలను ట్రాక్టర్లు, ఆటోల్లో వేసుకుని గుంటూరు బయలుదేరారు. మేడికొండూరులో పోలీసులు వీరిని నిలిపివేశారు.
ఫలితంగా మిర్చి ట్రాక్టర్లు బారులు తీరాయి. లక్షల రూపాయలు ఖర్చు చేసి సాగు చేసిన పంటను అమ్ముకునే అవకాశం లేదని మిర్చి రైతులు అన్నారు. ఇప్పుడు కోల్డ్స్టోరేజ్లో నిల్వ చేసేందుకు వెళ్తుంటే అడ్డుకోవటం ఏంటని ప్రశ్నించారు. ఎంతో దూరం నుంచి వచ్చామని... తాగడానికి నీరు, తినడానికి తిండి కూడా లేక ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి పంటను అమ్ముకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదు