ETV Bharat / state

విద్యార్ధి సంఘాల నేతల అరెస్ట్.. నల్లపాడు స్టేషన్​కు తరలింపు..

author img

By

Published : Jul 19, 2021, 4:49 PM IST

తాడేపల్లిలోని సీఎం ఇంటిని ముట్టడించేందుకు వెళ్తున్న విద్యార్ధి, యువజన సంఘాల నేతలను పోలీసులు అడ్డుకుని గుంటూరులోని నల్లపాడు స్టేషన్​కు తరలించారు. వీరిని తెదేపా సీనియర్​ నేత ఆలపాటి రాజా పోలీస్​స్టేషన్​లో పరామర్శించారు.

tdp leader alapati Raja
తెదేపా నేత ఆలపాటి రాజా

గుంటూరులోని నల్లపాడు పోలీస్ స్టేషన్‌ వద్ద విద్యార్ధి యువజన సంఘాల నేతలు ఆందోళన చేపట్టారు. కొత్త జాబ్‌ క్యాలండర్‌ విడుదల చేయాలనే డిమాండ్‌తో తాడేపల్లిలోని ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించేందుకు వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకుని నల్లపాడు స్టేషన్​​కు తీసుకువచ్చారు. అరెస్టయిన వారిని పరామర్శించేందుకు తెదేపా సీనియర్‌ నేత ఆలపాటి రాజా నల్లపాడు స్టేషన్‌ కు వచ్చారు. అయితే పోలీసులు ఆయనను బయటకు వెళ్లాలని సూచించారు. స్టేషన్‌ ప్రాంగణంలో ఉండొద్దని చెప్పడంపై రాజా అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసుల తీరును నిరసిస్తూ యువజన సంఘాలు ఆందోళనకు దిగాయి. స్టేషన్‌లో ఆందోళన చేస్తే కఠిన చర్యలుంటాయని సీఐ ప్రేమయ్య హెచ్చరించారు. సీఐ వైఖరిని యువజన సంఘాల నేతలు తప్పుబట్టారు. పోలీసులు ఆందోళనకారులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన కారులు నినాదాలు చేశారు.

ఇదీ చదవండీ.. Chalo Thadepalli: పోలీసు దిగ్బంధంలో తాడేపల్లి.. భారీ బందోబస్తు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.