కరోనా నేపథ్యంలో ప్రకటించిన లాక్డౌన్.. వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తెలంగాణ నుంచి గుంటూరు జిల్లా ముత్యాలంపాడు గ్రామానికి బతుకుతెరువు కోసం వచ్చిన 100 మంది వలస కుటుంబాలు లాక్డౌన్ కారణంగా ఇరుక్కుపోయాయి. పనులు లేక ఇబ్బందులు పడుతున్న వారికి గురజాల డీఎస్పీ శ్రీహరిబాబు, మాచర్ల ఎస్ఐ ఉదయలక్ష్మి ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ లాక్డౌన్కు సహకరించి ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండాలని పోలీసులు కోరారు. స్థానిక తహసీల్దార్ వెంకయ్య, గ్రామీణ సీఐ భక్త వత్సల రెడ్డి హాజరయ్యారు.
ఇదీ చూడండి: