ETV Bharat / state

NTR BHAVAN: ఎన్టీఆర్ భవన్​పై దాడి కేసు.. పోలీసుల అదుపులో 10 మంది

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడికి సంబంధించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మీడియాలో ప్రసారమైన దృశ్యాల ఆధారంగా.. అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయం తెలిపింది.

1
1
author img

By

Published : Oct 23, 2021, 2:09 PM IST

Updated : Oct 24, 2021, 4:51 AM IST

రాష్ట్రంలో సంచలనం రేపిన తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు పదిమందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు వైకాపా ఎమ్మెల్సీ అప్పిరెడ్డి అనుచరులు, విజయవాడకు చెందిన మరో వైకాపా నేత దేవినేని అవినాష్‌ సన్నిహితులని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు. తాజాగా తాము వీరిని అదుపులోకి తీసుకున్నట్లు గుంటూరు అర్బన్‌ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఆ పది మంది వీరే..
పానుగంటి చైతన్య, పల్లపు మహేష్‌ బాబు, పేరూరి అజయ్‌, శేషగిరి పవన్‌కుమార్‌, అడపాల గణపతి, గోక దుర్గాప్రసాద్‌ (గుంటూరు జిల్లా), షేక్‌ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, లంక అభినాయుడు, జోగ రమణ (విజయవాడ). ఇదే కేసులో జ్యోతిరాజా, షేక్‌సైదా, షేక్‌ బాబు అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల తెదేపా కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో వీరు పాల్గొన్నట్లు సీసీటీవీ పుటేజి ఆధారంగా పోలీసులు గుర్తించి నోటీసులు జారీ చేశారు. మిగిలిన నిందితులను పట్టుకోవడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. సీసీటీవీ పుటేజి ఇవ్వాల్సిందిగా తెదేపా కార్యాలయానికి 91 సీఆర్‌పీసీ కింద నోటీసు జారీ చేశామని, అది రాగానే మిగిలినవారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటామని తెలిపారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అనుసరించి.. వీరిని రిమాండ్‌కు ఇవ్వాలని కోరలేదని, నోటీసులు ఇచ్చి ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరుకావాలని సూచించి పంపామని గుంటూరు అర్బన్‌ ఎస్పీ కె.ఆరిఫ్‌ హఫీజ్‌ ‘ఈనాడు’కు వివరించారు. ఆ రోజు జరిగిన విధ్వంసంలో వీరి పాత్ర గురించి సీసీటీవీ పుటేజిని విశ్లేషించాల్సి ఉందని, ఆ తర్వాతే రిమాండ్‌కు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

కొందరి నేపథ్యంపై తెదేపా నేతలు చేస్తున్న ఆరోపణలివీ...

  • గుంటూరుకు చెందిన పానుగంటి చైతన్య లేళ్ల అప్పిరెడ్డికి ప్రధాన అనుచరుడు. అప్పిరెడ్డి ప్రజాప్రతినిధి అనిపించుకునే వరకు తాను గడ్డం, మీసాలు తీసేది లేదనేవారు. ఎమ్మెల్సీ పదవి రాగానే తిరుపతి వెళ్లి మొక్కుతీర్చుకున్నారు. ఆయన సభలు, సమావేశాలకు జనసమీకరణ చేయటం వంటి బాధ్యతలు చూస్తారు. గుంటూరు కన్యకాపరమేశ్వరి ఆలయ పాలకమండలి సభ్యుడు. ఆయనపై పలు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
  • పల్లపు మహేష్‌ రాష్ట్ర ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ డైరెక్టర్‌. ఈయనా అప్పిరెడ్డి వెన్నంటే ఉంటారు.
  • శేషగిరి పవన్‌ కూడా అప్పిరెడ్డికి వీరాభిమాని. ఆయన ఎమ్మెల్సీ కాగానే గుంటూరు నుంచి కాలినడకన దుర్గగుడికి వెళ్లి తలనీలాలు ఇచ్చి అభిమానం చాటుకున్నారు.

ఎన్టీఆర్ భవన్​కు నోటీసులు.. 'దాడిపై వచ్చి సాక్ష్యం చెప్పండి'

.

తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడికి సంబంధించి స్టేషన్‌కు వచ్చి సాక్ష్యం చెప్పాలని, సీసీ కెమెరాల్లో రికార్డయిన దాడి దృశ్యాలకు సంబంధించిన ఫుటేజీ అందజేయాలని కోరుతూ తెదేపా కార్యాలయానికి పోలీసులు రెండు నోటీసులు ఇచ్చారు. మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ పేరుతో ఇచ్చిన ఆ నోటీసుల్ని శనివారం మధ్యాహ్నం తెదేపా కేంద్ర కార్యాలయం గోడకు అంటించి వెళ్లారు. కార్యాలయంపై దాడికి సంబంధించి పార్టీ రిసెప్షన్‌ కమిటీ సభ్యుడు వల్లూరు కుమారస్వామి ఫిర్యాదు చేయడంతో... ఆయనకు సెక్షన్‌ 160 సీఆర్‌పీసీ కింద నోటీసు జారీ చేశారు. శనివారం సాయంత్రం ఐదు గంటల్లోగా మంగళగిరి రూరల్‌ పోలీసుస్టేషన్‌కు వచ్చి దర్యాప్తు అధికారి వద్ద సాక్ష్యం చెప్పాలని అందులో సూచించడం గమనార్హం. సెక్షన్‌ 91 సీఆర్‌పీసీ కింద పార్టీ ఆఫీసు ఇన్‌ఛార్జికి మరో నోటీసు ఇచ్చారు. అల్లరిమూకల దాడిలో తీవ్రంగా గాయపడిన పెండెం సాయిబద్రీనాథ్‌ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసుకి సంబంధించిన దర్యాప్తు నిమిత్తం సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫుటేజీ ఇవ్వాలని, దాడి చేసిన వారిని గుర్తించేందుకు, జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు ఈఫుటేజీ అవసరమని పేర్కొన్నారు.

గాజుపెంకులు, ఇతర శిథిలాల తొలగింపు
తెదేపా కేంద్ర కార్యాలయంపై అల్లరిమూకల దాడిలో పగిలిపోయిన అద్దాలు, ఫర్నిచర్‌ శిథిలాల్ని, దాడిలో దెబ్బతిన్న కార్లలో కొన్నింటిని తొలగించారు. చంద్రబాబు చేపట్టిన 36 గంటల నిరశన దీక్ష ముగిసేంత వరకు గాజుపెంకులు, శిథిలాల్ని అలాగే ఉంచిన సిబ్బంది శనివారం వాటిని తొలగించి కార్యాలయం మొత్తం శుభ్రం చేశారు.

ఇదీచదవండి:

28న రాష్ట్ర కేబినెట్ భేటీ.. ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు

Last Updated : Oct 24, 2021, 4:51 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.