తాడేపల్లి వద్ద కృష్ణానదిలో స్నానానికి దిగిన ఓ యువకుడు నీట మునిగి మృతి చెందాడు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని తాడేపల్లి మండలం పెనుమాకకు చెందిన జయబాబు, అతని స్నేహితులు కృష్ణానదిలోకి స్నానానికి దిగారు. కాసేపటికే జయబాబు నీట మునగటంతో.. గమనించిన స్థానికులు, స్నేహితులు బయటకు తీశారు. తీవ్ర అస్వస్థతకు గురవటంతో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జయబాబు మృతి చెందాడు.
ఇదీ చదవండీ...చేతబడి నెపంతో హత్యచేసి.. ఇసుకలో పూడ్చివేసి