చిత్తూరు జిల్లాలోని మదనపల్లి, పలమనేరు తదితర ప్రాంతాల నుంచి గుంటూరు జిల్లాకు రవాణా చేస్తున్న టమాటాల నాణ్యత తగ్గుతోంది. రవాణా సమయంలో అధికారుల తనిఖీలు, ఆంక్షలతో జిల్లాకు రావడానికి ఆలస్యమవుతోంది. గుంటూరు నగరంతో పాటు తెనాలి పట్టణాల్లోని రైతుబజార్లకు తరలించిన టమాటాలు కొంతమేర పాడవ్వడంతో.. వ్యాపారులు వాటిని పారబోశారు. ఒక్కో ట్రేలో సుమారు 5 నుంచి 8 కేజీల వరకు దెబ్బతిన్నాయని విక్రయదారులు వాపోతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని, రవాణాలో ఆంక్షలు సడలించాలని వ్యాపారులు కోరుతున్నారు.
ఇదీచదవండి.