రేపల్లె ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి ప్రచారం గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే తెదేపా అభ్యర్థి అనగాని సత్య ప్రసాద్ నిజాంపట్నం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెదేపా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల్లో అధిక మెజారిటీతో తెదేపాను గెలిపించాలని కోరారు. చంద్రబాబు మళ్లీఅధికారంలోకి వస్తేనే... రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని ప్రజలకు సూచించారు. జగన్, కేసీఆర్, మోదీకలిసి రాష్ట్ర ప్రజలను మోసం చెయ్యాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబుపై విమర్శలు చెయ్యడం సరికాదన్నారు. హత్యా రాజకీయాలను తెదేపా ప్రోత్సహించదన్నారు. 31 కేసులున్న ఘనత ప్రతిపక్ష నాయకుడికే దక్కుతుందన్నారు.ప్రజా సంక్షేమం కోసం పాటుపడే నాయకులను ఎన్నుకోవాలని సత్య ప్రసాద్ కోరారు.
ఇవి చదవండి
కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు