ETV Bharat / state

సబ్​ రిజిస్ట్రార్​ ప్రవర్తనపై ప్రజల ఆందోళన

ప్రభుత్వ ఉద్యోగి ప్రవర్తన సరిగా లేదని ప్రజలు ఆందోళన దిగిన ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది. పనుల కోసం కార్యాలయానికి వచ్చిన ప్రజలు పట్ల ఇన్​ఛార్జ్ సబ్​ రిజిస్ట్రార్ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని బాధితులు వాపోయారు. కార్యాలయానికి వచ్చిన వారితో అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.

Bhattiprolu Sub-Registrar Office
భట్టిప్రోలు సబ్​ రిజిస్టర్ కార్యాలయం
author img

By

Published : Jun 11, 2021, 10:43 PM IST

సబ్​ రిజిస్టర్​ ప్రవర్తనపై ప్రజల ఆందోళన

గుంటూరు జిల్లా భట్టిప్రోలు మండలంలో ఇన్​ ఛార్జ్ సబ్​ రిజిస్ట్రార్​ ప్రవర్తన బాగాలేదని ప్రజలు ఆందోళన చేపట్టారు. పనుల కోసం వచ్చిన ప్రజలతో ఇన్​ ఛార్జ్ సబ్​ రిజిస్టర్​గా విధులు నిర్వహిస్తున్న హుస్సేన్​ఖాన్​ దురుసుగా ప్రవర్తిస్తున్నాడని.... కార్యాలయం చుట్టూ రోజుల తరబడి తిప్పుకుంటున్నాడని బాధితులు ఆసహనం వ్యక్తం చేశారు. కార్యాలయానికి వచ్చిన వారి దగ్గర అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గంటల తరబడి ఎదురుచూపులు తప్ప పనులు మాత్రం కావటం లేదని వాపోయారు.

అన్ని కార్యాలయాలలో సకాలంలో దస్తావేజులు ఇస్తున్నా.. భట్టిప్రోలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో దస్తావేజులు ఇవ్వకుండా మంతనాలు జరుపుతున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. సబ్ రిజిస్ట్రార్ సెలవుల్లో ఉండటంతో సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న హుస్సేన్​ఖాన్... ఇన్​ఛార్జ్ సబ్​ రిజిస్ట్రార్​గా విధులు చేపట్టారు.

ఇదీ చదవండి

'కరకట్ట వెంట చేపట్టిన ఇసుక తవ్వకాలను నిలిపివేయాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.