ETV Bharat / state

జనతా కర్ఫ్యూకు ప్రజల సంఘీభావం..చప్పట్లతో అభినందనలు - people clapped at nellore

కరోనా వైరస్ నివారణ కృషి చేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి సంఘీభావంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలోని ప్రజలు చప్పట్లు కొట్టారు. వారి ఇళ్లలోనుంచి బయటకు వచ్చి అభినందనలు తెలియజేస్తూ డప్పు చప్పుళ్లతో,చప్పట్లతో సంఘీభావం తెలిపారు.

people clapped for solidarity of various staff working on prevention of corona  across the state.
రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సంఘీభావ చప్పట్లు
author img

By

Published : Mar 22, 2020, 8:01 PM IST

Updated : Mar 22, 2020, 9:03 PM IST

కృష్ణా జిల్లాలో...

కరోనా వైరస్ నివారణకు కృషి చేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి విజయవాడలోని ప్రజలు చప్పట్లతో సంఘీభావం తెలిపారు. లోటస్ ,ల్యాండ్మార్క్ అపార్ట్​మెంట్ వాసులు బయటకు వచ్చి కరతాళధ్వనులతో సంఘీభావం ప్రకటించారు. మహమ్మద్​పేట ప్రజలు కరోనా వ్యాప్తి చెందకుండా దేశంకోసం పని చేస్తున్న వివిధ సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు కొట్టారు. పోలీస్ యంత్రాంగానికి, వైద్య బృందానికి, పాత్రికేయ మిత్రులకు అభినందనలు తెలియజేస్తూ డప్పు చప్పుళ్లు చేశారు.

విజయవాడలో సంఘీభావ చప్పట్లు
కృష్ణా జిల్లా మహమ్మద్​పేటలో సంఘీభావ చప్పట్లు

విజయనగరం జిల్లాలో...
విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని ప్రజలు కరోనా వైరస్ నివారణకు కృషి చేస్తున్న వివిధ సిబ్బందికి సంఘీభావంగా చప్పట్లు కొట్టారు. ఇళ్లనుంచి అందరూ బయటకి వచ్చి చప్పుళ్లు చేశారు.

విజయనగరం జిల్లా సాలూరులో సంఘీభావ చప్పట్లు

నెల్లూరు జిల్లాలో...

నెల్లూరు పట్టణంలో దేశంకోసం పని చేస్తున్న వివిధ సిబ్బందికి ప్రజలు సంఘీభావంగా చప్పట్లు కొట్టారు. ఈ కార్యక్రమంలో పోలీసులు కూడా వారితో పాటు చప్పట్లు కొట్టారు.

నెల్లూరులో సంఘీభావ చప్పట్లు

గుంటూరు జిల్లాలో...

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో కరోనా వైరస్ నివారణకు కృషి చేస్తున్న వైద్యులు, ఇతర సిబ్బందికి చిన్నారులు చప్పట్లతో సంఘీభావం తెలిపారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్లలో చిన్నారుల సంఘీభావ చప్పట్లు

ఇదీచూడండి. రాష్ట్రంలో 3 జిల్లాల్లో కరోనా ప్రభావం:కేంద్రం

Last Updated : Mar 22, 2020, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.