ఇంటి వద్దకే పింఛన్ కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే - jagan updates on ap pension scheme
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఇంటి వద్దకే ఫించన్ కార్యక్రమాన్ని ఎమ్యెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. తాడేపల్లిలోని క్రిష్టియన్పేటలో ఇంటి వద్దకే పెన్షన్ కార్యక్రమానికి జిల్లా అధికారులతో కలిసి శ్రీకారం చుట్టారు. వృద్ధులకు రూ.2,250, విభిన్న ప్రతిభావంతులకు రూ.3 వేలు, కిడ్నీ బాధితులకు రూ.10 వేలు లబ్ధిదారులకు అందజేశారు. ఇంటి వద్దనే వేలి ముద్రలు సేకరించి ప్రభుత్వం మంజూరు చేసిన డబ్బులను అధికారులు పంపిణీ చేశారు.