ETV Bharat / state

వాటర్ ప్రాజెక్ట్ మొదటి దశ టెండర్లు పూర్తి చేయాలి: మంత్రి పెద్దిరెడ్డి

గ్రామీణ నీటి సరఫరా, వాటర్‌గ్రిడ్‌పై తాడేపల్లిలోని కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్‌కు మొదటి దశ టెండర్లు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. జల్‌ జీవన్‌ మిషన్, నాబార్డ్‌ నుంచి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.

peddi reddy review on water grid
గ్రామీణ నీటి సరఫరాపై మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష
author img

By

Published : Jul 1, 2020, 5:35 PM IST

జల్‌ జీవన్‌ మిషన్, నాబార్డ్‌ నుంచి రావాల్సిన నిధులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఎక్స్‌టర్నల్‌ ఎయిడెడ్‌ ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టాలని ... ఎమ్మెల్యేల నుంచి వస్తున్న వినతులపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కడా నీటి సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామీణ నీటి సరఫరా, వాటర్‌గ్రిడ్‌పై తాడేపల్లిలోని కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఉన్నతాధికారులు ఈ సమీక్షకు హాజరయ్యారు.

వాటర్‌గ్రిడ్‌ కింద చేపట్టాల్సిన పనులు, నిధుల కేటాయింపులపై అధికారులను మంత్రి వివరాలు అడిగారు. అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజ్, డ్రెయిన్స్‌ నిర్మాణం, పనుల పురోగతి పై మంత్రి సమీక్షించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పనుల విషయంలో అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలని.. రూ.12,308 కోట్లతో చేపట్టనున్న వాటర్‌గ్రిడ్‌ ప్రాజెక్ట్‌కు మొదటి దశ టెండర్లు వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు.

పీఎంజీఎస్‌వై నిధులు రాష్ట్రానికి తీసుకువచ్చే అంశంపై అధికారులు మరింత శ్రద్దపెట్టాలని.. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిద్దామన్నారు. అటవీశాఖ అనుమతులు వచ్చిన తర్వాతే పనులు గ్రౌండింగ్‌ చేయాలని.. లేదంటే పరిపాలనా అనుమతులు మంజూరు చేయవద్దని మంత్రి పెద్దిరెడ్డి స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: కుయ్.. కుయ్.. శబ్ధాలతో మార్మోగిన విజయవాడ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.