ETV Bharat / state

పులిచింతల ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మకు ఎమ్మెల్యే జలహారతి - పులిచింతల ప్రాజెక్ట్​ తాజా వార్తలు

పులిచింతల ప్రాజెక్టు కృష్ణా జలాలతో పుష్కలంగా నిండింది. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్​ రావు కృష్ణా జలాలకు ఆదివారం జలహారతి ఇచ్చారు.

pedakurapadun mla  given prayers to pulichintala project in guntur district
జలహారతిలో పాల్గొన్న పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్​ రావు
author img

By

Published : Aug 23, 2020, 7:14 PM IST

అచ్చంపేట మండలం పులిచింతల ప్రాజెక్టు వద్ద కృష్ణా జలాలకు స్థానిక ఎమ్మెల్యే నంబూరు శంకర్​రావు ప్రత్యేక పూజలు నిర్వహించి జలహారతి ఇచ్చారు. ప్రాజెక్టులు నిండుకుండల్లా ఉండటం వల్ల రైతాంగం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టుల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పాలన కొనసాగించడం శుభసూచకం అని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్​ పాలనలో ప్రకృతి సహకరించి పుష్కలంగా వర్షాలు పడి.. పంటలు బాగా పండి రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందన్నారు.

ఇదీ చదవండి :

గాజులదిన్నె ప్రాజెక్టుకు జలకళ... దిగువకు నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.