భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇవాళ నిర్వహించనున్న ‘భారతమాత మహాహారతి’ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, గరికపాటి నరసింహారావు తదితరులు హాజరుకానున్నారు. ట్యాంక్ బండ్ సమీపంలోని ఐ మాక్స్ పక్కనున్న హెచ్‌ఎండీఏ గ్రౌండ్‌లో సాయంత్రం 5 గంటలకు ఈ వేడుక జరగనుంది.
దేశప్రజలకు పవన్ గణతంత్ర శుభాకాంక్షలు తెలిపారు. 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగ స్ఫూర్తి అజరామరంగా వర్థిల్లడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జనవరి 26 భారతీయులందరికీ పండగ రోజుగా అభివర్ణించారు. దేశ ప్రజలందరూ కులమతాలకు అతీతంగా జరుపుకొనే వేడుకని తెలిపారు.
ఇదీ చదవండి:రాష్ట్ర ప్రజలకు సీఎం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు