గుంటూరు పీవీకే.నాయుడు మార్కెట్‌తో జిల్లా ప్రజలకు అనుబంధం ఉందని పవన్ కల్యాణ్ అన్నారు. మార్కెట్‌పై పేదలు ఆధారపడి ఉందని, వారిని రోడ్డున పడేస్తారా? అని ప్రశ్నించారు. సంపద సృష్టి అంటే పెట్టుబడులు తేవాలి.. ఆస్తులు అమ్మడం కాదని హితవు పలికారు. పెట్టుబడులు వచ్చే మార్గాన్ని ప్రభుత్వం అన్వేషించడం లేదని పవన్ ఆరోపించారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే విద్యుత్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తుల వేలాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: డిజిటల్ ఫ్లాట్ ఫాంపై 'పసుపు జెండా'.. ఇది ఓ ప్రయోగమే!