ETV Bharat / state

151 మందిని గెలిపిస్తే.. ఏం చేస్తున్నారు?: పవన్ - నివర్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పవన్ పర్యటన వార్తలు

నివర్ తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే 10వేల సాయం అందించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లాలో వర్షాల కారణంగా నష్టపోయిన పంటపొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి.. పంట పెట్టుబడి, జరిగిన నష్టం గురించి ఆరా తీశారు.

151 మందిని గెలిపిస్తే.. ఏం చేస్తున్నారు?: పవన్

author img

By

Published : Dec 2, 2020, 8:15 PM IST

Updated : Dec 2, 2020, 10:18 PM IST

నివర్ తుపాను నష్టంపై రైతులతో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఎకరాకు 22 వేల రూపాయల వరకు ఖర్చు అయిందని... ఇపుడు అది కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. పంట పొలాల పరిశీలన అనంతరం రేపల్లె పట్టణంలోని అంకమ్మ చెట్టు కూడలిలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తుపాను కారణంగా పంట పొలాల్లో ఇంకా నీళ్లు నిలిచి ఉన్నాయన్నారు. జరిగిన నష్టం చూసి కొందరు రైతులు మరణించటంపై ఆవేదన వెలిబుచ్చారు. 151 మంది శాసనసభ్యులను గెలిపిస్తే వైకాపా ప్రభుత్వం ఏం చేస్తోందని పవన్ ప్రశ్నించారు. ప్రజల కష్టాలు వారికి పట్టడం లేదని విమర్శించారు. అసెంబ్లీలో బూతులు తిట్టుకోవటం మాని రైతుల కష్టాలు చూడాలన్నారు.

తుపాను కారణంగా కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని పవన్ అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 35 వేలు పరిహారంగా చెల్లించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఉపయోగించుకుని త్వరగా పంట నష్టం పరిహారం ఇవ్వాలని సూచించారు. గతంలో భవన నిర్మాణ కార్మికుల కోసం అండగా నిలబడ్డామని... ఇపుడు అదే విధంగా వరద బాధిత రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని పవన్ స్పష్టం చేశారు.

పెదరావూరు, తెనాలి, నందివెలుగు, కొలకలూరు, వేమూరు మండలం చవాలిలో పవన్ పర్యటించారు. ఎన్నికల్లో ఓడినా ప్రజల తరఫున పోరాటం చేస్తున్నానని పవన్ అన్నారు. వైకాపాలో గెలిచిన 151 మందీ కార్యాలయాలకే పరిమితమయ్యారని.. ప్రజల కష్టాలు తెలుసుకుని పరిపాలన చేయాలని పవన్ సూచించారు.

ఇదీ చదవండి: విశాఖలో యువతిపై కత్తితో యువకుడి దాడి

Last Updated : Dec 2, 2020, 10:18 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.