ETV Bharat / state

Pawan Kalyan Fires on CM Jagan: జనసేన తరఫున ప్రజా కోర్టు కార్యక్రమం.. మొదటగా జగన్నే విచారిస్తాం: పవన్ - JanaSena chief Pawan Kalyan comments

Pawan Kalyan Fires on CM Jagan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన తరఫున ప్రజా కోర్టు కార్యక్రమం చేపట్టబోతున్నామని, మొట్టమొదటగా రాష్డ్ర ముఖ్యమంత్రినే ఆ ప్రజా కోర్టులో విచారణ చేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించారు.

humbnail_16x9_Pawan_ Kalyan_ Comments_2023

author img

By

Published : Aug 15, 2023, 2:17 PM IST

Pawan Kalyan Fires on CM Jagan: జనసేన తరఫున ప్రజా కోర్టు కార్యక్రమం.. మొదటగా జగన్నే విచారిస్తాం: పవన్

Pawan Kalyan Fires on CM Jagan: జనసేన పార్టీ తరఫున ప్రజా కోర్టు కార్యక్రమం చేపట్టబోతున్నామని.. ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. మొట్టమొదటగా రాష్డ్ర ముఖ్యమంత్రిని ఆ ప్రజా కోర్టులో విచారణ చేస్తామని ప్రకటించారు. సామాజిక మాధ్యమాల్లో లేదా ప్రత్యక్షంగా విచారణ చేస్తామని వెల్లడించారు. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో వీర మహిళలతో సమావేశమైన పవన్ కల్యాణ్.. సీఎం జగన్ పాలనపై, తాడేపల్లి ప్యాలెస్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Pawan Kalyan Latest Comments.. పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..''స్వాతంత్య్ర పోరాటంలో మహిళల పాత్ర గురించి చాలా తక్కువగా మాట్లాడుకుంటున్నాం. కానీ, భారతదేశ రాజ్యాంగ నిర్మాణంలో ఆనాడూ దాదాపు 15 మంది మహిళలు పాలుపంచుకున్నారు. స్త్రీ లేకుండా ఏ వ్యవస్థ నడవదు. నేను జనసేన పార్టీ నడపడంలో మహిళల పాత్ర కీలకం. ప్రతి సమావేశంలో మూడో వంతు మహిళలు ఉండాలి. దేశం కోసం త్యాగం చేసిన మహిళలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పొట్టి శ్రీరాములుకు సరైన గుర్తింపు రాలేదు. తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానం చేసిన మహనీయుడు ఆయన... కానీ, పొట్టి శ్రీరాములు ఫొటో ఏ కార్యక్రమంలో కనిపించదు. కేవలం సీఎంల ఫొటోలు మాత్రమే కనిపిస్తాయి. మన కోసం బలిదానం చేసిన వారిని మనం గౌరవించుకోవాలి. భారతదేశ సంస్కృతి అన్ని మతాలకు సరైన విలువ ఇచ్చింది'' అని ఆయన అన్నారు.

Pawan Kalyan Visited Vissannapeta Lands: వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలపై కాదు.. భూములపై మాత్రమే ప్రేమ: పవన్

Pawan Kalyan on the Manipur incident.. మణిపూర్‌ రాష్ట్రంలో తాజాగా జరిగిన గొడవల్లో బాధితులు స్త్రీలేనని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. రెండు తెగలు, వర్గాలు కొట్టుకుంటే మహిళలు బాధితులు కావాల్సిందేనా..? అని ఆయన ప్రశ్నించారు. స్త్రీలు అత్యంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారని పవన్ కల్యాణ్ ఆవేదన చెందారు. రాష్ట్రంలో మహిళలు అదృశ్యం కావడం చాలా పెద్ద విషయమన్న పవన్ కల్యాణ్.. మహిళల భద్రతకు జనసేన పార్టీ అధిక ప్రాధాన్యత ఇస్తోందని హామీ ఇచ్చారు. ఆడబిడ్డల రక్షణకు జనసేన ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని వివరించారు. రానురానూ రాష్ట్రంలోని స్త్రీలను గౌరవించాలన్న కనీస స్పృహ లేకుండా పోతోందని పవన్ మండిపడ్డారు.

Pawan visited CBCNC lands in Visakhapatnam విశాఖ సీబీసీఎన్‌సీ భూములను పరిశీలించిన పవన్.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక కోర్టుల చుట్టూ తిరగాలి!

Pawan sensational Allegations Against Tadepalli Palace.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివసిస్తున్న తాడేపల్లి ప్యాలెస్‌లో అత్యధిక క్రైమ్‌ రేట్‌ ఉందన్న పవన్ కల్యాణ్.. తాడేపల్లిలో సామూహిక అత్యాచారం, హత్యలు జరిగాయని సంచలన ఆరోపణలు చేశారు. తాడేపల్లిలో జరిగిన ఏ ఒక్క సంఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఎందుకు మాట్లాడదని దుయ్యబట్టారు. ఇటీవలే బాపట్ల జిల్లాలో తన సోదరిని వేధించిన వారిని ప్రశ్నించినందుకు 14 ఏళ్ల పిల్లవాడిని పెట్రోల్ పోసి చంపారని పవన్ గుర్తు చేశారు. శాంతి భద్రతలు జనసేన పార్టీకి చాలా ముఖ్యమైన అంశామన్న పవన్.. జగన్‌ పాలన అస్తవ్యస్తంగా ఉందని ఆగ్రహించారు.

మరోసారి జగన్‌ మోహన్ రెడ్డి పాలన వస్తే..రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక వేత్తలు, వైద్యులు పారిపోతారు. ఇక్కడ ఉండలేము బాబోయ్ అంటూ పారిపోతామంటారు. ఇక్కడే పుట్టిన వాళ్లం ఎక్కడికి పారిపోతాం. మనం ఎవరికైనా ఎందుకు భయపడాలి..?. అందుకే జనసేన పార్టీ తరఫున ప్రజా కోర్టు కార్యక్రమం చేపట్టబోతున్నాం. మొదటగా రాష్డ్ర ముఖ్యమంత్రినే ప్రజా కోర్టులో విచారణ చేస్తాం.-పవన్ కల్యాణ్, జనసేన అధినేత

Janasena chief Pawan Kalyan fires on volunteer system: 'ఉత్తరాంధ్ర నుంచి 155 మంది చిన్న పిల్లలు అదృశ్యమైపోయారు..!..ఆ చిన్నారులు ఏమైపోయారు..?'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.