ETV Bharat / state

గెలుపుపై ధీమా.. ఛైర్మన్‌ పీఠం ఎవరిదో ! - చిలకలూర్ పేట వార్తలు

ఈనెల 10న ఓటర్లు వేసిన ఓట్లు బ్యాలెట్‌ పెట్టెల్లో నిక్షిప్తం అయ్యాయి. పోటీ చేసిన అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మాకే పురపాలక ఛైర్మన్‌ పీఠం అంటూ బాహాటకంగా చెబుతున్నారు. వార్డుల వారిగా మద్దతుదారుల లెక్కలు తీసి.. ఆధిక్యం మాదేనంటూ ధీమాగా ఉన్నారు. ఈ నేపథ్యంలో వినుకొండ, చిలకలూరిపేట పురపాలక సంఘాల్లో అభ్యర్థుల జయాపజయాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. అసలు ఫలితం రేపు ఓట్ల లెక్కింపులో తేలిపోనుంది.

chilakalurpet municipal elections results
గెలుపుపై ధీమా !.. ఛైర్మన్‌ పీఠం ఎవరిదో !
author img

By

Published : Mar 13, 2021, 3:46 PM IST

పేట పాలకులు ఎవరో?

చిలకలూరిపేట పురపాలక ఛైర్మన్‌ పీఠం మాకు దక్కుతుందంటే.. కాదు.. మాకే దక్కుతుందంటూ ప్రధాన పార్టీల నేతలు ధీమా వారు వ్యక్తం చేస్తున్నారు. పుర ఎన్నికల్లో 35 వార్డులకు ఎన్నికలు నిర్వహించారు. ఇరు పార్టీల వారు కూడా ఓటర్లకు నగదు పంపిణీ చేశారు. ఒక పార్టీకి చెందిన వారు ప్రతి వార్డుకు నగదు పంపిణీ చేశామని, ఇతర పార్టీకి చెందినవారు తక్కువ నగదు పంపిణీ చేశారని, ఎక్కువ మంది ఓటర్లు మా వైపు మొగ్గు చూపారని భావిస్తున్నారు.

పార్టీల లెక్కలు...

ఒక పార్టీకి చెందిన వారు మేము నగదు పంపిణీ చేశామని.. ప్రజల్లో మార్పు వచ్చిందని ఓట్లు మాకే పడ్డాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్‌ శాతం తక్కువుగా నమోదైన చోట మాకు కలిసి వస్తుందని ఒక పార్టీ, ఓటింగ్‌ ఎక్కువ శాతం నమోదైన చోట మాకు అనుకూలంగా ఉంటుందని మరో పార్టీ.. ఇలా ఇరు పార్టీలు ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. మొత్తం 38 వార్డులు ఉండగా ఛైర్మన్‌ పీఠం దక్కించుకోవాలంటే 20 వార్డులు గెలవాల్సి ఉంది. అయితే ఇప్పటికే వైకాపాకు 3 వార్డులు ఏకగ్రీవమయ్యాయి.

రేపల్లెలోనూ ఉత్కంఠే..

రేపల్లె మున్సిపాలిటీలోని 28 వార్డులకు నాలుగు ఏకగ్రీవం కాగా, 24 చోట్ల ఎన్నికలు నిర్వహించారు. 3, 5, 9, 10, 13 వార్డుల్లో జనసేన, 6, 22, 23 వార్డుల్లో భాజపా అభ్యర్థులు అధికార, ప్రతిపక్ష పార్టీలకు పోటీగా నిలిచారు. 10 వార్డుల్లో ఇద్దరు చొప్పున, తొమ్మిది చోట్ల ముగ్గురు, నాలుగు చోట్ల నలుగురు, ఒక వార్డులో ఐదుగురు చొప్పున అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 3, 6, 15, 18, 28 వార్డుల్లో నెలకొన్న పోటీలో ఎవరు విజయం సాధిస్తారోనని ఆయా పార్టీల నాయకులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. రేపల్లెలోని ఓ వార్డులో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడగా, అక్కడ ఫలితంపై అంతటా ఉత్కంఠ నెలకొంది. పోరులో నెగ్గేందుకు ఇద్దరూ పోటీ పడి మరీ ప్రచారం చేశారు. ఓటింగ్‌ ప్రక్రియలోనూ ఓటు నీదా నాదా అన్నట్టుగా సాగిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

వినుకొండ.. ఎవరికి అండ

అభ్యర్థుల భవిత్యం బ్యాలెట్‌ పెట్టెల్లో నిక్షిప్తమైంది. గెలుపుపై ఆయా రాజకీయ పార్టీల నేతలు లెక్కలు కట్టి అంచనాలు చెబుతున్నారు. వైకాపా అధికారంపై ధీమాగా ఉంది. ఏకగ్రీవ వార్డులు ఏడు తన ఖాతాలో వేసుకున్న ఆ పార్టీ పోటీ జరిగిన 25లో ఒకట్రెండు మినహా మిగిలినవన్నీ మావేనని గట్టిగా చెబుతున్నారు. పోలింగ్‌ పూర్తయిన వెంటనే బొల్లా ఫాలోయిర్స్‌ పేరుతో 32వ వార్డు మినహా మిగిలిన వన్నీ ఆ పార్టీ ఖాతాలో వేసి వార్డుల వారిగా మెజార్టీ అంచనాలు వేసి సామాజిక మధ్యమాల్లో పెట్టారు. నామినేషన్ల ఉపసంహరణ సమయంలో కొందరు అభ్యర్థులు పోటీ నుంచి వైదొలగడంతో అప్రమత్తమైన తెదేపా ఈ ఎన్నికల్లో సీపీఐతో కలిసి పోటీకి దిగింది.

పార్టీ పోటీ చేసిన 18 వార్డుల్లో ఐదు నుంచి ఎనిమిది చోట్ల గెలుపు బాటలో ఉన్నట్లు చెబుతున్నారు. మరో రెండింటిలో నువ్వా.. నేనా? అన్నట్లుగా ఉన్నామని అంచనా వేసి ఎక్కువ సీట్లు కొత్త పట్టణంలో గెలుస్తామని ధీమాతో నేతలు ఉన్నారు. ఆ పార్టీ మిత్రపక్షం సీపీఐ ఐదు చోట్ల పోటీ చేసి మూడింటిపైన ఆశలు పెట్టుకుంది. భాజపా, జనసేన కలిసి ఎనిమిది వార్డులలో అభ్యర్థులను రంగంలోకి దించి తమకు సంప్రదాయ ఓట్లున్న వార్డుల్లో విజయంపైన నేతలు నమ్మకం పెట్టుకున్నారు. ఎంఐఎం పలువార్డుల్లో పోటీ చేసింది. గణనీయంగా ఓట్లు సాధిస్తామని ఆపార్టీ నేతలు చెబుతున్నారు. ఎవరి నమ్మకం వారికున్నప్పటికీ అసలు ఫలితం 14న వెలువడనుంది. అప్పటి వరకు వేచి చూడాల్సిందే.

ఇదీ చదవండి:

గుంటూరులో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.