గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరు ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న రాజ్ కుమార్ గత ఏడాది సస్పెండ్ అయ్యాడు. మద్యం సేవించి రావడం, విద్యార్థులతో మద్యం సీసాలు కడిగించడం, సిగరెట్లు తెప్పించడం వంటివి చేస్తున్నాడన్న ఆరోపణలతో అధికారులు అతన్ని సస్పెండ్ చేశారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో కొల్లిపర మండలానికి ఆయన్ను డిప్యుటేషన్‌పై పంపించారు. పాఠశాలలు వచ్చే నెలలో పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజ్ కుమార్‌ను తిరిగి ఇదే పాఠశాలలో అధికారులు నియమించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల వద్దకు వచ్చి ఆందోళన చేశారు. ఆ ప్రధానోపాధ్యాయుడు ఇక్కడే ఉండేట్లయితే తమ పిల్లలకు టీసీలు ఇవ్వాలని కోరారు. లేదా అతన్ని బదిలీ చేసి వేరే టీచర్ని నియమించాలన్నారు. దీనిపై ఎంఈఓ కెనడితో మాట్లాడగా... తల్లిదండ్రుల ఆందోళన విషయాన్ని డీఈవో దృష్టికి తీసుకెళ్ళామని.. రాజ్‌కుమార్‌ను కొల్లిపర మండలానికి డిప్యుటేషన్‌పై పంపించాలని ఆదేశించినట్లు చెప్పారు.
ఇవీ చదవండి...
ఏ2 అల్లుడు కంపెనీకి 108, 104 అంబులెన్స్‌లు దానం చేశారు: తెదేపా