ETV Bharat / state

ఇల...వరి నారుమడిలో గోవింద నామాలు.. చూతము రారండి! - గుంటూరులో గోవింద నామాల ఆకృతిలో వరి నారు

సేంద్రీయ వ్యవసాయం, దేశవాళీ విత్తనాల వినియోగానికి ప్రచారం కల్పించేందుకు గుంటూరు జిల్లాకు చెందిన ఓ యువరైతు వినూత్న ప్రయోగం చేశారు. గోవింద నామాల రూపంలో వరి నారు పోశారు. అవి మొలకొత్తి చక్కని దృశ్యంగా కనిపిస్తున్నాయి. గోవిందనామం, శంకుచక్రాలను చూసేందుకు గ్రామస్థులు వస్తున్నారు. యువరైతు ప్రతిభను మెచ్చుకుంటున్నారు.

ఇల...వరి నారుమడిలో గోవింద నామాలు.. చూతము రారండి!

author img

By

Published : Aug 30, 2020, 6:01 AM IST

ఇల...వరి నారుమడిలో గోవింద నామాలు.. చూతము రారండి!

సేంద్రీయ వ్యవసాయానికి, దేశవాళీ విత్తనానికి ప్రచారం కల్పించేందుకు గుంటూరు జిల్లాకు చెందిన యువరైతు వినూత్న ప్రయోగం చేశారు. తన పొలంలో గోవింద నామాల ఆకృతిలో వరినారు పోశారు. కొల్లిపొర మండలం అత్తోటకు చెందిన యువరైతు బాపారావు కొన్నేళ్లుగా సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నారు. తనతో పాటు కలిసి వచ్చిన రైతులను కూడా ఇదే తరహా విధానానికి మళ్లించారు. హైబ్రిడ్ విత్తనాల కన్నా దేశవాళీ విత్తనాలు మన ఆరోగ్యానికి, నేలకు మంచిదనే ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకూ 100కు పైగా దేశీయ వరి రకాల్ని సాగుచేశారు.

వివిధ రకాల జబ్బులు ఎదుర్కొనేందుకు ఆ విత్తనాలు ఉపయోగపడతాయని బాపారావు అంటున్నారు. మరింత ఎక్కువ మందికి దేశవాళీవిత్తనాలు, సేంద్రీయ వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు చేరవేసేందుకు వరి వంగడాల్ని గోవింద నామాల రూపంలో తన పొలంలో చల్లారు. అవి మొలకెత్తటంతో గోవింద నామాలు రూపంలో వరినారు కనిపిస్తోంది.

వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేస్తామని బాపారావు అంటున్నారు. అందుకే గోవింద నామాల రూపంలో విత్తనాలు జల్లినట్లు తెలిపారు. బాపారావు చేసిన ప్రయోగాన్ని రైతులంతా హర్షిస్తున్నారు. అక్కడకు వెళ్లి గోవిందనామాలు, శంకుచక్రాలను చూస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు డ్రోన్ కెమెరాలో ఈ దృశ్యాలు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.

ఇదీ చదవండి : ఏటీఎంలో కరెంటు తీస్తున్నారు... సొమ్ము కొట్టేస్తున్నారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.