గుంటూరు జిల్లా దుర్గి మండలం ఆదిగొప్పులలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు. పొలం తగాదాల విషయంలో మీసేవా కేంద్రం నిర్వాహకుడు ఘంటా శ్రీనివాసులు హత్యకు గురయ్యారు. శ్రీనివాసులు పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో..వెనకనుంచి వచ్చిన దుండగులు గొడ్డలితో నరికారు.
ఈ ఘటనలో శ్రీనివాసులు అక్కడిక్కడే మృతిచెందాడు. ఈ హత్యకు తోటవాసు అతని కుటుంబమే కారణమని మృతుని భార్య ఆరోపించారు. ఘటనా స్థలిలో ఆమె కన్నీరుమున్నీరైంది. పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి ..దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి. బంగారం దుకాణంలోనే సైనైడ్ మింగి కార్మికుడి ఆత్మహత్య