గుంటూరు జిల్లా శావల్యాపురం మండలంలో రైతులు జొన్న కంకుల కోతను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ముండ్రువారిపాలెంకు చెందిన కూలీలతో తెల్లవారుజామున టాటా ఏస్ వాహనం చక్రాయపాలెం వెళ్తుంది. శానంపూడి సమీపంలో ఆ వాహనం వెనుక డోరుకు ఉన్న చైను తెగిపోవడంతో కూలీలు కిందపడ్డాడు. ఈ ఘటనలో గాయపడ్డవాళ్లను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
శానంపూడి గ్రామానికి చెందిన ముత్తయ్య పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కూలీలు తెలిపారు. ప్రమాదంలో ముండ్రువారిపాలెం గ్రామానికి చెందిన కలుపుకూరి ఏసు, కలుపుకూరి మోజెస్.. పట్టణంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.