ETV Bharat / state

పంట నష్టాన్ని అంచనా వేస్తున్న అధికారులు - Agricultural Advisory Committee chairmen inspect damaged paddy in Pratipadu

నివర్ తుపాను ప్రభావంతో.. ప్రత్తిపాడులో దెబ్బతిన్న వరి పొలాలను అధికారులు పరిశీలించారు. కుళ్లిపోయిన వరి గింజలను చూపుతూ అన్నదాతలు ఆవేదన చెందారు. వేల రూపాయల పెట్టుబడితో సాగు చేసిన తమకు.. తుపాను పూర్తిగా నష్టాన్ని మిగిల్చిందని కన్నీరుమున్నీరయ్యారు.

officers  inspect damaged paddy in Pratipadu
పంట నష్టాన్ని అంచెన వేస్తున్న అధికారులు
author img

By

Published : Nov 29, 2020, 12:07 PM IST

నివర్ తుపాను కారణంగా గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను, వట్టి చెరుకూరు మండలాల్లో వరి పైరు పూర్తిగా దెబ్బతింది. పులిచింతల ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ డేవిడ్ రాజ్, జిల్లా వ్యవసాయ సలహా కమిటీ చైర్మన్ శివరామకృష్ణ పొలాలను పరిశీలించారు.

నీటిలో నానుతున్న వరి పైరును అన్నదాతలు అధికారులకు చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. వేల రూపాయలు పెట్టుబడితో సాగు చేస్తే తుపాను ధాటికి పూర్తిగా నష్టపోయామని బాధపడ్డారు. మురుగు నీటి వ్యవస్థ సరిగా లేకపోవడంతోనే నీరు పొలాల్లో నిలిచిపోతుందని చెప్పారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చదవండి:

ఇంకా ముంపు నీటిలోనే పంట చేలు..గుండె చెరువైన అన్నదాత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.