గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామ పంచాయతీల్లో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులపై విద్యుత్ శాఖ అధికారులు దృష్టి సారించారు. పెదకాకాని, గుంటూరు గ్రామీణ మండలాల పరిధిలో బిల్లులు కట్టని పంచాయతీలకు ఈ మేరకు విద్యుత్ అధికారులు నోటీసులు జారీచేశారు. పెదకాకాని మండలంలో రూ.7.82 కోట్లు, గుంటూరు గ్రామీణ మండల పరిధిలో రూ. 2.30 కోట్ల బకాయిలున్నాయి.
వీధి దీపాలు, తాగునీటి పథకాల నిర్వహణకు విద్యుత్ ఛార్జీలను పంచాయతీలు చెల్లించాల్సి ఉంది. సంబంధిత వర్గాలకు నోటీసుల ద్వారా ఈ విషయం తెలియపర్చామని.. పెండింగు బిల్లులో కనీసం 40 శాతం కూడా చెల్లించని పంచాయతీలకు విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేయాల్సిందిగా ఉన్నతాధికారులు ఆదేశించినట్లు విద్యుత్ శాఖ ఈఈ జె.హరిబాబు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: