ETV Bharat / state

గుంటూరు జిల్లాలో చిరుజల్లులు.. ఈదురుగాలులు

నివర్ తుపాను ప్రభావంతో గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా జల్లులు పడుతున్నాయి. కొన్నిచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. రైతులు పంట పాడైపోతుందేమో అన్న ఆందోళనలో ఉన్నారు. రేపల్లెలో సముద్రతీరం వెంబడి ఈదురు గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దన్న ఉన్నతాధికారుల హెచ్చరికలతో వేట ఆగిపోయింది.

nivar cyclone
నివర్ ప్రభావం.. గుంటూరు జిల్లాలో ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు
author img

By

Published : Nov 26, 2020, 12:06 PM IST

నివర్ తుపాన్ ప్రభావంతో గుంటూరు జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా నూజండ్లలో 17.6, దుగ్గిరాల 16.4, రేపల్లె 15.4, అమరావతి, నిజాంపట్నంలలో 10.2 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

తుపాను ప్రభావంతో ఈదురు గాలుల కారణంగా కొన్ని చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు నగరంలోనూ ఎడతెరిపి లేకుండా చిరుజల్లులు పడుతున్నాయి. వేమూరు, చుండూరు, అమృతలూరు, రెంటచింతల, భట్టిప్రోలు, పెదనందిపాడు, దాచేపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. తుపాన్ ప్రభావం పెరిగే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్ఛరికల నేపథ్యంలో.. జిల్లావ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ వర్షాలకు పొలాల్లో వరి పంట పాడైపోతుందని రైతులు ఆందోళనలో ఉన్నారు. కొద్దిరోజుల్లో కోతలు చేపట్టాల్సిన సమయంలో వానలు పడటం వారిని కలవరపెడుతోంది.

సముద్రతీరం వెంబడి ఈదురుగాలులు

రేపల్లె నియోజకవర్గంలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. సముద్ర తీరం వెంబడి ఈదురు గాలులు వీస్తూ అలలు హెచ్చు స్థాయిలో ఎగిసి పడుతున్నాయి. తుపాను హెచ్చరికలతో నిజాంపట్నం హార్బర్ వద్ద అధికారులు మూడో నంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీచేశారు. వేటకు వెళ్లిన వారు తిరిగి తీరానికి చేరుకుని బోట్లను జెట్టి వద్ద నిలిపివేశారు. సముద్రంలో వేట బాగున్న సమయంలో ఒక్కసారిగా మత్స్య వేట ఆపేయాల్సి రావడంపట్ల మత్స్యకారులు నిరాశకు గురవుతున్నారు.

ఇవీ చదవండి:

బలంగా తుపాను ప్రభావం.. కోస్తా, సీమ జిల్లాల్లో భారీ వర్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.