మోదీ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చేది రాహుల్ నేతృత్వంలోని ప్రభుత్వమేనని అన్నారు. సీఎం చంద్రబాబుకు రామచంద్రరావు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రానికి కంటితుడుపు లాంటి ప్యాకేజీ ప్రకటించినప్పుడు ధన్యవాదాలు తెలిపిన చంద్రబాబు.. ఇప్పుడు మోదీని విమర్శించడం విడ్డూరమన్నారు. ఇప్పటికైనా ప్రజల మంచి కోరి ఈ నిర్ణయం తీసుకోవడం ఆనందమే అన్నారు. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తులు లేకుండా కాంగ్రెస్ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
![undefined](https://s3.amazonaws.com/saranyu-test/etv-bharath-assests/images/ad.png)