ETV Bharat / state

రాష్ట్ర ప్రజలకు గవర్నర్​, సీఎం నూతన సంవత్సర శుభాకాంక్షలు

New Year 2024 Wishes: రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రితో పాటు పలువురు ప్రముఖులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలు కొత్త సంవత్సరంలో ఆనందంగా, సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని కోరుకున్నారు. ప్రజలు అభివృద్ధి పథంలో పయనించాలని అభిలషించారు.

new year wishes
new year wishes
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 31, 2023, 7:27 PM IST

New Year 2024 Wishes: 2023 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2024 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రజలు సన్నద్ధమవతున్న వేళ పలువురు ప్రముఖులు తెలుగు రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో నూతనోత్సాహంతో, కొత్త అవకాశాలను అన్వేషించి లక్ష్యాలను సాధించడానికి స్పూర్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు. రానున్న సంవత్సరంలో ప్రతి ఇంట్లో ఆనందాలు వెల్లివిరియాలని, అభివృద్ధి కాంతులు విరజిల్లాలని కోరుకున్నారు.

గవర్నర్​ శుభాకాంక్షలు: నూతన సంవత్సరం 2024ను పురష్కరించుకుని రాష్ట్ర గవర్నర్​ ఎస్‌ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం రాష్ట్ర ప్రజలకు ఉల్లాసాన్ని, సంతోషాన్ని, శాంతిని, శ్రేయస్సును అందించాలని ఆకాంక్షించారు. కొత్త సంవత్సరం ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూడడానికి, కొత్త అవకాశాలను అన్వేషించడానికి, లక్ష్యాలను సాధించడానికి స్ఫూర్తిని ఇస్తుందన్నారు.

కళ్లు చెదిరే సెలబ్రేషన్స్​తో 2024కు స్వాగతం- ఈ ఫొటోలు చూస్తే ఔరా అనాల్సిందే!

తెలుగు ప్రజలకు సీఎం జగన్​ శుభాకాంక్షలు : 2024 నూతన సంవత్సరం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంవత్సరంలో ప్రతి ఇంటా ఆనందాలు, అభివృద్ధి కాంతులు వెల్లివిరియాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి దైవానుగ్రహం సంపూర్ణంగా లభించాలని అభిలషించారు.

బాలకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు: ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు ప్రజలకు నూతన ఏడాది సుఖసంతోషాలను, ఆయురారోగ్యాలను, సిరిసంపదలను ఇవ్వాలని ఆకాంక్షించారు. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, నూతన సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం పలుకుదామన్నారు. నూతన సంవత్సరంలో ప్రజదలందరి కలలు సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

2023 బెస్ట్​ ఐకానిక్ మూమెంట్స్​- 'విరాట్' 50వ సెంచరీయే హైలైట్

రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకలు: నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధమయ్యారు. ఇప్పటికే పాశ్చాత్య దేశాల్లో నూతన సంవత్సరం వేడుకలు ప్రారంభమైన, తెలుగు ప్రజలు నూతన సంవత్సరానికి వెల్​కమ్​ చెప్పడానికి ఏర్పాట్లను చేసుకుంటున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నూతన సంవత్సర వేడుకల నిమిత్తం వ్యాపారులు అందుకు తగిన విధంగా సిద్ధమయ్యారు. ఆంగ్ల నూతన సంవత్సరం మొదటి రోజున కేకులు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసుకుని కొత్త సంవత్సరం వేడుకలు నిర్వహించుకోవడానికి ప్రజలు సమయత్తమవుతున్నారు.

ఇందుకోసం ప్రజల అభిరుచులు అనుగుణంగా పలు రకాల రుచులు, ఆకారాల్లో కేకులు తయారు చేస్తున్నారు. పలు రంగుల్లో ఆకర్షణీయంగా ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. కేకులతో పాటు పూల బొకేలు, పండ్ల వ్యాపారులు సైతం ప్రజల అభిరుచులకు అనుగుణంగా తయారు చేస్తున్నారు.

2024లోనూ కొనసాగనున్న పసిడి జోరు! 10 గ్రాముల బంగారం ధర రూ.70 వేలకు చేరే అవకాశం!

పండ్లతో బొకేలు తయారుచేసి ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కేకులు పంపిణీ చేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

కాకినాడ జిల్లాలో అంతర్భాగమైన కేంద్ర పాలిత ప్రాంతం యానంలో నూతన 2024 సంవత్సరానికి స్వాగతం పలికేందుకు చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరూ ఉత్సహంతో ఎదురుచూస్తున్నారు. ఇందుకు స్థానికంగా బేకరిలు 1కేజీ నుంచి 10 కేజీల వరకు బరువుండే కేకులను రూపొందిస్తున్నారు.

ఈ కేకుల ధరలు వేల రూపాయల్లో పలుకుతున్నాయి. యానంలోని బిర్యాని పాయింట్లు సిద్ధమయ్యాయి. పలు రకాల బిర్యానిలతో పాటు హెటళ్లలో ప్రత్యేక వంటకాలను తయారు చేస్తున్నారు.

'తెలుగు స్టేట్స్​లో ప్రభాస్​ ఇమేజ్ చాలు- అక్కడ 'సలార్' ప్రమోషన్స్ పెంచాల్సింది!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.