National Christian Board: ఎంతో విలువైన లూథరన్ చర్చిల ఆస్తులను సంరక్షించాలని జాతీయ క్రిస్టియన్ బోర్డు తెలుగు రాష్ట్రాలను కోరింది. హైదరాబాద్లో నిర్వహించిన జాతీయ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఏపీ, తెలంగాణతోపాటు కర్ణాటకలో విస్తరించి ఉన్న లూథరన్ చర్చిల ఆస్తులను అమ్ముకునేందుకు భారీ కుట్రలు చేస్తున్నారని బోర్డు జాతీయ అధ్యక్షుడు జాన్ మార్క్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఏపీ హోంమంత్రి సుచరిత, బ్రదర్ అనిల్ పేర్లు చెబుతూ.. లాజరస్ అబ్రహం అనే వ్యక్తి ఏపీలో 150 ఎకరాల భూములను విక్రయించారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై పలు పోలీసు స్టేషన్ల్లో కేసులు కూడా నమోదయ్యాయని గుర్తు చేశారు. ఈ చర్యలకు పాల్పడుతున్న లాజరస్ అబ్రహంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు అతనిపై ఏపీ సర్కార్ ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. అబ్రహం అక్రమాలపై త్వరలోనే డీజీపీని కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి