ఆ గ్రామం జనసేన పార్టీ గుండెల్లో ఎప్పటీకీ ఉంటుంది: నాగబాబు - ఇప్పటం గ్రామ ప్రజలకు నాగబాబు కృతజ్ఢతలు
జనసేన ఆవిర్భావ సభ ఘనంగా నిర్వహించడానికి సహకరించిన గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామస్తులకు పార్టీ నాయకుడు, సినీనటుడు నాగబాబు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఇప్పటం గ్రామాన్ని సందర్శించి అక్కడి ప్రజలతో మాట్లాడానని.., వారి ప్రేమ తనను ఎంతో కదిలించిందని చెప్పారు. జనసేన పార్టీ గుండెల్లో ఇప్పటం గ్రామం ఎప్పటికీ ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా నాగబాబు రైతులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. నిన్న (సోమవారం) ఇప్పటం గ్రామంలో జనసేన పార్టీ తొమ్మిదో ఆవిర్భావ సభ జరిగిన సంగతి తెలిసిందే.