NABARD Chairman: వాతావరణ మార్పులకు అనుగుణంగా పంటల ఎంపిక, సమగ్ర వ్యవసాయ విధానాలతో పాటు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటే ప్రపంచంలోనే మన దేశం అగ్రస్థానంలో ఉంటుందని నాబార్డు ఛైర్మన్ చింతల గోవిందరాజులు అన్నారు. చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో.. గుంటూరులో నిర్వహించిన అభ్యుదయ రైతుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రైతులు ఒకే పంట వేసే విధానానికి స్వస్తి పలికి.. రెండు, మూడు రకాల పంటలు, కూరగాయల పెంపకంతో పాటు, వ్యవసాయ అనుబంధ ఆదాయాలపైనా దృష్టి సారించాలన్నారు. సేంద్రీయ సాగుతో నేలలను తిరిగి సారవంతం చేయాలని రైతులకు సూచించారు.
ఇవీ చూడండి