పట్టపగలే ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో జరిగింది. వీరంశెట్టి కిషోర్ అనే యువకుడు మార్కెట్ కూడలిలో నిలుచుని ఉండగా... బైక్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా కత్తులతో పొడిచారు. దీంతో కిషోర్ అక్కడికక్కడే కుప్పకూలాడు. సమీపంలోనే పోలీసులు ఉండటంతో వారు అక్కడకు చేరుకుని బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దాడికి పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియలేదు. కిషోర్‌కు ఎవరితో కక్షలు లేవని అతని కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ చూడండి. పాజిటివ్ వస్తే ఫోన్ స్విచ్ఛాప్..అడ్రస్‌కు వెళ్తే ఆచూకీ లేదు
తెనాలిలో పట్టపగలే ఓ యువకుడిపై హత్యాయత్నం - తెనాలిలో యువకుడిపై హత్యాయత్నం వార్తలు
గుంటూరు జిల్లా తెనాలిలో పట్టపగలే ఓ యువకుడిపై హత్యాయత్నం జరిగింది. అందరూ చూస్తుండగానే విచక్షణారహితంగా ఇద్దరు వ్యక్తులు అతనిని కత్తులతో పొడిచారు.