ETV Bharat / state

సీఐడీ అదనపు డీజీతో ముప్పాళ్ల నాగేశ్వరరావు భేటీ

author img

By

Published : Jun 10, 2020, 6:44 PM IST

అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు సీఐడీ అదనపు డీజీని కలిశారు. అధికారంలోకి వచ్చి ఏడాదైనా బాధితులకు న్యాయం చేయలేదని విమర్శించారు.

muppalla nageswararao meeting with cid additional dg sunil kumar
ముప్పాళ్ల నాగేశ్వరరావు

రాష్ట్రంలోని అగ్రిగోల్డ్ బాధితులకు వెంటనే న్యాయం చేయాలని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో సీఐడీ అదనపు డీజీ సునీల్​కుమార్​తో ముప్పాళ్ల సమావేశమయ్యారు.

రూ. 20వేల రూపాయలలోపు ఉన్న బాధితులకు ప్రభుత్వం సహాయం చేస్తామని మాట ఇచ్చిందని.. దానిని ఇంతవరకు నెరవేర్చలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను వేగంగా గుర్తించేందుకు వార్డు వాలంటీర్ల సహాయం తీసుకోవాలని సూచించారు. సంస్థ నుంచి స్వాధీనం చేసుకున్న భూముల్లో పేదలకు స్థలాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇవీ చదవండి.... 'రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.