కొవిడ్ విధులకు కేటాయించబడిన అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని గుంటూరు నగర పాలక కమిషనర్ చల్లా అనురాధ అన్నారు. కొవిడ్ విధులకు కేటాయించబడిన అధికారులతో కమిషనర్ ప్రత్యేకంగా సమావేశం జరిపారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసుల కారణంగా అధికారులు మరింత అప్రమత్తంగా ఉండి బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని సూచించారు. దీనికోసం నగర పాలక సంస్థ ప్రత్యేకంగా అధికారులకు విధులు కేటాయించడం జరిగిందన్నారు.
ఇవీ చూడండి...