ETV Bharat / state

కబళించిన మృత్యువు... కుమారుడి కళ్లెదుటే తల్లి కన్నుమూత - గుంటూరు జిల్లా నేర వార్తలు

గుంటూరు జిల్లా కాకుమాను వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం, ట్రాక్టర్ ఢీ కొన్న ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

mother death infront of her son in kakumanu guntur district
కుమారుడి కళ్లెదుటే తల్లి కన్నుమూత
author img

By

Published : May 30, 2021, 9:25 PM IST

గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన అన్నవరపు మరియమ్మ.. తన కుమారుడు సుధీర్​తో కలిసి ద్విచక్రవాహనంపై ప్రకాశం జిల్లా పర్చూరు మండలం చెరుకూరుకు బయల్దేరారు. వీరు కాకుమాను వద్దకు చేరుకోగానే.. వేగంగా వచ్చిన మట్టి ట్రాక్టర్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్​పై ఉన్న తల్లీ, కుమారులు కిందపడ్డారు. మరియమ్మ పైనుంచి ట్రాక్టర్ దూసుకెళ్లడంతో.. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అప్పటివరకు తనతో సరదాగా మాట్లాడుతున్న అమ్మ.. తన కళ్లెదుటే మృతి చెందడంతో సుధీర్ రోదించిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని బాపట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీచదవండి.

కష్టాలు తీరలే.. కన్నీరు ఆగలే ..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.