విజయదశమిని పురస్కరించుకుని యడ్లపాడులోని శ్రీ పార్వతి దేవి అమ్మవారికి ఎమ్మెల్యే విడదల రజిని పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెంలో జరిగిన నవరాత్రి ఉత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు అర్చకులు స్వాగతం పలికారు.
జగన్మాత ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలంతా సుఖ శాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని కోరుకున్నానన్నారు. ప్రజలందరికీ విజయ దశమి శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండి: