గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలోని అన్ని పంచాయతీ స్థానాల్లో వైకాపా మద్దతుదారులే విజయం సాధిస్తారని స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ధీమా వ్యక్తం చేశారు. మొదటి, రెండో దశల్లో వైకాపా మద్దతుదారులు 95 శాతం విజయం సాధించారని తెలిపారు. తెదేపా విజయం సాధించినట్లు చెబుతున్న చంద్రబాబు.. ఎక్కడ, ఎవరు, ఎన్ని స్థానాల్లో గెలిచారో వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు భయపడే పార్టీ తమది కాదని.. ఏ పరిస్థితులు వచ్చినా ప్రజలు తమ పక్షాన్నే నిలబడతారన్నారు.
ఇదీ చదవండి: